పూనమ్ కౌర్ పెళ్లి చేసుకోబోతోందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అలాగే పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె ఎంత అందంగా ఉంటుందో అంతే కాంట్రవర్సీలలో కూడా తలదూరిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఒక మాట అంటే చాలు తనదైన శైలిలో ట్వీట్ ల వర్షం కురిపిస్తూ ఎదుటివారిని ముప్ప తిప్పలు పెడుతుందని చెప్పవచ్చు. ఇక గత కొంత కాలం నుంచి వివాహానికి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎందుకు వివాహం చేసుకోలేదు అనే వార్తలు కూడా రకరకాల కోణాలలో వైరల్ అవుతున్నప్పటికీ ఈమె మాత్రం వాటిపై స్పందించడం లేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు పెళ్లి కుదిరిందా? అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈమె షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. కర్వా చౌత్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం రాత్రి పూనమ్ కౌర్ ఒక ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఆమె చేతిలో జల్లెడ పట్టుకొని చంద్రుడు వైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.. దీన్ని చూసి పూనం కౌర్ కు పెళ్లి జరిగిందా? లేక పెళ్లి కుదిరిందా? అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి ఉత్తరాదిలో మహిళలు కర్వాచౌత్ వేడుకలను జరుపుకుంటారు.

భర్త క్షేమాన్ని కోరుతూ పెళ్లయిన మహిళలు పార్వతి దేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు . రాత్రి సమయంలో చంద్రుడి దర్శనంతోనే ఈ వేడుకలు పూర్తవుతాయి. జల్లెడలో చంద్రుడిని చూసి ఆ వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లయిన మహిళలు పెళ్లి కానీ యువతులు కూడా ఈ పూజలు నిర్వహిస్తారు. కాబోయే భర్తతో కలిసి పూజలు చేసి అతడి మొహాన్ని ఇలా జల్లెడలో చూస్తారు. అయితే ఇప్పుడు అలాంటిది పూనం కౌర్ కూడా కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లందరూ నిజంగానే పెళ్లయిందా అంటూ కూడా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై పూనం కౌర్ ఎలా స్పందిస్తుందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version