ద‌క్షిణ భార‌తం ప్ర‌త్యేక దేశ‌మా ? ఎవ‌రు కోరుకుంటున్నారు ఉత్తర కుమారా !

-

ఉత్త‌ర భార‌తం, ద‌క్షిణ భార‌తం క‌లిసే ఉంటాయి. ప్ర‌జ‌లూ సంస్కృతులూ ఎన్న‌డూ క‌లిసే ఉంటాయి..భాష సంబంధిత సౌంద‌ర్యం ఎన్న‌డూ క‌లిసే ఉంటుంది. మ‌రి! ఓ వ‌ర్గం మీడియాకు కానీ లేదా ఓ వ‌ర్గం నాయ‌కుల‌కు కానీ దేశం లో అత్యున్న‌త ప‌ద‌విని ఇవ్వ‌నంత మాత్రాన అదొక ప్రాంతీయ వివ‌క్ష అన్న అర్థం వ‌చ్చేవిధంగా మాట్లాడుతున్నారు. బాగుంది ప‌ద‌వులు ఇవ్వ‌నంత మాత్రాన వివ‌క్ష కాదు ఓ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వ‌క‌పోయినా లేదా క‌నీస స‌హ‌కారం అందించ‌క‌పోయినా అది క‌దా వివ‌క్ష అవుతుంది.. క‌నీస స్థాయిలో ఆలోచించ‌కుండా కేవ‌లం వ‌ర్గ ప్ర‌యోజ‌నాలు, పార్టీ ప్ర‌యోజ‌నాలు దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే న‌వ్విపోతారు.. క‌దా !

“వెంకయ్య‌కు ప‌ద‌వి ఇచ్చినా, ఇవ్వ‌కున్నా వ‌చ్చిన లాభ‌మూ లేదు న‌ష్ట‌మూ లేదు కానీ దీన్నొక రాజ‌కీయ ఎత్తుగ‌డ గా భావించి, పార్టీలు పొలిటిక‌ల్ మైలేజీని బాగానే పెంచుకుంటున్నాయి. ఇవే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ఉప రాష్ట్ర ప‌తి హోదాలో ఆయ‌న నెల్లూరుకు ఏం చేశారు అని? ఆయ‌న అనే కాదు ఏ నాయ‌కుడికి అయినా ప‌దవి రానంత మాత్రాన అది ఓ ప్రాంతానికి చెందిన వివ‌క్ష కింద ఎందుకు ఫోక‌స్ చేస్తున్నారు. ఇందులో ఏ వ‌ర్గం ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి అని ! అంటే వెంక‌య్య‌కు ప‌ద‌వి రాక‌పోతే ఇక్క‌డి ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌త్యేక దేశాన్ని కోరుకుంటున్నార‌ని ఎలా అన‌గ‌ల‌రు ? ఇవ‌న్నీ దేశ సౌభ్రాత‌త్వంపై ప్ర‌భావితం చేసే వ్యాఖ్య‌లే కదా ! ఆ పాటి కూడా ఆలోచించ‌కుండా ఎలా మాట్లాడుతార‌ని ? ” ఇవీ ఓ అడ్వ‌కేట్ చెబుతున్న మాట‌లు. కర్నూలు జిల్లాకు చెందిన బి.కృష్ణ అనే అడ్వ‌కేట్ చెబుతున్న మాట‌లు. ముఖ్యంగా దేశ భ‌ద్ర‌త, ఐక్య‌త, సుస్థిర‌త అన్న విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకునే ఎవ్వ‌రైనా మాట్లాడాలి అని, ప్రాంతీయ విద్వేషాలు ప్రోగు చేసేలా, పెంపొందించేలా మాట్లాడ‌రాద‌ని ఆయ‌న అంటున్నారు.ఇదే వాదం ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతోంది.

కొన్ని మాటలు ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్బాలు మాదిరిగా ఉంటాయి. రాష్ట్ర‌ప‌తి లాంటి అత్యున్న‌త ప‌దవుల కేటాయింపులో కేంద్రం చూపిస్తున్న వివ‌క్ష కార‌ణంగా ఆరు రాష్ట్రాల ప్ర‌జ‌లు ద‌క్షిణ భార‌తంను ప్ర‌త్యేక దేశంగా ఏర్పాటు చేయాల‌ని కోరుకుంటున్నారంటూ ఓ వ్యాఖ్య చేయ‌డంతో ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ యాంక‌ర్ కోర్టు బోనులో నిలుచోనున్నారు. ఇప్ప‌టికే ఓ అడ్వ‌కేట్ ఆ ఛానెల్ నిర్వాహ‌కుడి పై కేసు కూడా ఫైల్ చేశారు. వాస్తవానికి వెంక‌య్య నాయుడికి ఉప రాష్ట్ర‌ప‌తి హోదానే చాలా ఎక్కువ‌ని వైసీపీ వ‌ర్గాలు త‌రుచూ అంటుంటాయి. వారి వాద‌న ఎలా ఉన్నా వెంకయ్య‌కు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇవ్వ‌డం అన్న‌ది ఇవ్వ‌క‌పోవ‌డం అన్న‌ది బీజేపీ అంత‌ర్గ‌త విష‌యం. కానీ దాని వల్ల తె లుగు జాతికి అవ‌మానం అంటూ ఓ వ‌ర్గం మీడియా తోచిన విధంగా భాష్యాలు చెబుతున్నాయి.ఓ ఛానెల్ యాంక‌ర్ అయితే మ‌రో అడుగు ముందుకు వేసి ఇదంతా కేంద్రం కుట్ర, ఇలా అయితే ఇక్క‌డి ప్ర‌జ‌లంతా వేరే దేశం కోరుకున్నా కోరుకుంటారు అంటూ వింత వాద‌న ఒక‌టి వినిపించారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది.

వెంక‌య్య‌కు అత్యున్న‌త ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఓ వ‌ర్గం మీడియా అంతా చాలా అంటే చాలా మ‌థ‌న‌ప‌ప‌డిపోతోంద‌ని వైసీపీ అంటోంది. అయినా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌వ‌హారాన్ని తెలుగు జాతికి ఏ విధంగా ఆపాదిస్తారు అని కూడా సాయిరెడ్డి లాంటి ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే వెంక‌య్య‌కు పద‌వి ఇవ్వ‌నంత మాత్రాన ద‌క్షిణాదిపై కేంద్రానికి వివ‌క్ష ఉంద‌ని ప్రచారం చేసుకుని పొలిటిక‌ల్ మైలేజీ పొందాల‌ని చూస్తున్నారా అని కూడా అంటోంది. అడుగుతోంది. తాము ఓ గిరిజ‌న మ‌హిళ‌కు అత్యున్న‌త ప‌ద‌వి రావ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, ఇందులో ఎటువంటి వాదాల‌కూ తావే లేద‌ని కూడా స్ప‌ష్టం చేస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కర్నూలుకు చెందిన అడ్వ‌కేట్ బి.మోహ‌న కృష్ణ కోర్టులో సంబంధిత ఛానెల్ పై చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ
కేస్ ఫైల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version