పెద్దిరెడ్డికి టీడీపీ చెక్..చిత్తూరులో సీన్ మార్చేశారుగా!

-

రాష్ట్రంలో జగన్-చంద్రబాబు మధ్య ఎలాంటి రాజకీయం యుద్ధం నడుస్తుందో..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య అలాంటి రాజకీయ యుద్ధం నడుస్తుందనే చెప్పాలి. చిత్తూరు జిల్లా చంద్రబాబు, పెద్దిరెడ్డిల సొంత జిల్లా. వీరికి ముందు నుంచి రాజకీయ వైరం ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బాబుకు జగన్ చెక్ పెడితే..చిత్తూరులో పెద్దిరెడ్డి చెక్ పెట్టారు.

బాబుని సొంత జిల్లాలోని చెక్ పెట్టారు. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 13 సీట్లు గెలిచేలా పెద్దిరెడ్డి కృషి చేశారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కుప్పంతో సహ 14కి 14 సీట్లు గెలవాలని పెద్దిరెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే రాష్ట్రంలో జగన్ 175కి 175 సీట్లు గెలవాలని ఎలా టార్గెట్ గా పెట్టుకున్నారో…అలాగే చిత్తూరులో స్వీప్ చేయాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న బాబు..చిత్తూరులో పెద్దిరెడ్డిని కూడా నిలువరించాలని చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో టి‌డి‌పి బలం పెరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. అటు నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కాస్త మైలేజ్ వచ్చింది.

అయితే ఇటీవల సర్వేలో టి‌డి‌పి కాస్త పుంజుకుందని తేలింది. జిల్లాలో 14 సీట్లలో వైసీపీ 8, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. అయితే టి‌డి‌పి ఇంకా బలపడాల్సి ఉంది. వైసీపీకి పోటీగా సీట్లు సాధించాలని చూస్తుంది. పెద్దిరెడ్డికి చెక్ పెట్టేలా బలపడాలని చూస్తుంది.

టి‌డి‌పికి లీడ్ ఉన్న కుప్పం, మదనపల్లె, నగరి, పలమనేరు కాకుండా పీలేరు, కాళహస్తి సీట్లలో సత్తా చాటాలని టి‌డి‌పి చూస్తుంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే తిరుపతి, చిత్తూరు సీట్లలో సైతం గెలుపు అవకాశాలు ఉంటాయి. మొత్తానికి జిల్లాలో పెద్దిరెడ్డి చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version