ఫ్యాక్ట్ చెక్: నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.6 వేల భృతిని అందజేస్తోందా?

-

ఇప్పుడు ఎవరూ చూసిన స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. అందులో ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు.పిల్లలు మొదలు పెద్దలకు వరకు అందరూ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాను యూజ్ చేస్తూనే ఉంటారు..

ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు దోచుకోవడానికి వాడుకుంటుంటే.. మరికొందరు అసత్య ప్రచారాలకు వినియోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో ఓ సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఇది చాలా మందిని ప్రభావితం చేస్తోంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 6,000 నిరుద్యోగ భృతిని అందజేస్తోందని, ప్రతి నెల నిరుద్యోగుల అకౌంట్లలో ఈ డబ్బు జమ అవుతుందని ఆ సందేశంలో ఉంది..

ఇలాంటి ఫేక్ వార్తలు గతంలో ఎన్నో వచ్చాయి..ఈ సందేశం గురించి PIB స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఇది నిజమా? అబద్ధమా? తేల్చింది. ఇందులో వాస్తవం ఏంత అనేదానిని నిర్ధారిస్తూ ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ప్రతి నెల రూ. 6,000 భృతి ఇస్తోందంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న కంటెంట్‌లో ఏమాత్రం నిజం లేదని తేల్చింది..మన ప్రభుత్వం అలాంటివి ఇవ్వలేదని చెప్పింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి సందేశాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పిఐబి తెలిపింది. ఇలాంటి అసత్య సమాచారాన్ని ఫార్వార్డ్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది..పీఐబీ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ని సందర్శించాలి. ఇది కాకుండా, వాట్సాప్ నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.comకు కూడా చెయ్యవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version