మార్చి నెల 1 నుంచి పేదలకు రేషన్ కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పలుమార్లు ప్రకటించారు. కానీ, మార్చి పదో తారీఖు వచ్చినా పేదలకు రేషన్ బియ్యం అందలేదని తెలుస్తోంది.
దీంతో నిరుపేదల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం సంగతి పక్కనబెడితే ప్రతినెలా ఇచ్చే దొడ్డు బియ్యం కూడా సరిగ్గా దిక్కులేదనని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అవసరమైన రేషన్ బియ్యం 1.51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యింది 62,346 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అని తెలిసింది. ప్రతిసారి వచ్చే పండుగ నుండి సన్న బియ్యం ఇస్తాం అని చెప్పడంతో ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటన చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.