వర్మ పేరు వెనుక ఇంత కథ ఉందా.. తెలిస్తే నవ్వుతారు..?

-

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కూడా పలు వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. తీసే సినిమాల నుంచి మాట్లాడే విధానం వరకు ప్రతి దాంట్లో కూడా కాంట్రవర్సీ ఉంటుంది. ఇక వర్మ ని ఎంత మంది విమర్శించే వారు ఉన్నారో అంతే స్థాయిలో పొగిడే వారు కూడా ఉన్నారని చెప్పవచ్చు. సమాజంలో జరిగే కొన్ని అంశాలను సినిమా కథాంశంగా తీసుకువచ్చి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు రాంగోపాల్ వర్మ.ఇక ఇలాంటి సమయంలోనే తాజాగా కొండా మురళి సురేఖ జీవిత కథ ఆధారంగా వర్మ కొండ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. ఇక వర్మ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో చాలా బిజీ ఇంకా పాల్గొన్నారు ఈ క్రమంలో బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకొని కొండ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వర్మ తన వ్యక్తిగత జీవితం విషయం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

దేవుడిని పెద్దగా నమ్మని వర్మ పేరు లో మాత్రం రాముడు గోపాలుడు అనే పేర్లు ఎందుకు ఉన్నాయ్ అనే ప్రశ్న ఎదురవగానే.. అందుకు వర్మ సమాధానం తెలియజేస్తూ నిజానికి తన పేరు “రామ్ పండు “స్కూల్లో అందరూ ఈ పేరుతో పిలిచి తన ఏడిపించేవారని దాంతో తన స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తుంటే చివరిక్షణంలో తన తండ్రి రామ్ గోపాల్ వర్మ గా పేరు మార్చారు అని తెలియజేశారు. అయితే తన పేరు మార్చుకోవాలని ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని తెలిపారు వర్మ. ఇలా మొదటి సారి తన పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version