వికారాబాద్‌లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు ఎందుకు వెళ్లారని ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ సాయిలత బూతులు తిడుతూ వారిని తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
మంగళవారం ఉదయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘గురుకులాల్లో ఇట్లనేనా మా పిల్లలను మీరు పెంచేది? పిల్లలను ‘లేకి ముండా’, వాల్ల తల్లులను ‘దొంగ ముండా’ అని తిట్టొచ్చా? వాళ్లను ఇట్ల కొట్టొచ్చా? మీ ఇళ్లలో పిల్లలను ఇట్లనే దండిస్తరా? వాళ్లు చదివే పాఠశాలలో వాళ్లను ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.అననంతరం తెలగాణ సీఎం, సీఎంవో, సీఎస్, డీజేపీ, సోషల్ వెల్ఫేర్ శాఖకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు.పిల్లలు ఏ తప్పు చేయలేదని నేను అనడం లేదు.కానీ, ఈ వయసులో వాళ్లను కూర్చోబెట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ ఇట్ల కొట్టడమేంది? రేవంత్ గారు, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ పోయింది?’ అని నిలదీశారు.