ఇదా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష?: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు .కరీంనగర్ సభలో కేసిఆర్ నిప్పులు చెరిగారు. హోదాకు తగిన తీరులో రేవంత్ రెడ్డి మాటతీరు లేదంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు ఏవయ్యా, కరెంటేదీ? నీళ్లేవీ? అని అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా.. చీరుతా చంపుతా అని మాట్లాడతాడు అని మండిపడ్డారు.ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషా ఇది? నేనూ ఉద్యమం సమయంలో మాట్లాడాను కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక్కసారైనా నా నోటి నుంచి దురుసు మాట విన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.

‘మేం ఇంటింటికీ మంచినీరు సరఫరా చేశాం. రెప్పపాటు కూడా కరెంట్ తీయలేదు అని గుర్తు చేశారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే.. కరెంట్ ఇవ్వకపోయినా, రైతు బంధు లేకున్నా మళ్లీ మాకే ప్రజలు ఓటేశారు అంటారు అని అన్నారు. 6 గ్యారంటీలకు ఎగనామం పెడతారు. ఈ సమయంలో వారికి మీరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరిగిపోతుంది’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version