ప్రస్తుతం సోషల్ మీడియాలో కొవిడ్ తగ్గేందుకు వివిధ రకాల చిట్కాలను షేర్ చేస్తున్నారు. అదేవిధంగా కర్పూరం వాడటం వల్ల బ్లడ్‌లోకి ఆక్సిజన్ లెవల్ పెరుగుతుందనే వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ సహజమైన అరోమెటిక్ మిశ్రమంతో ఆక్సిజన్ పెంచే గుణం కర్పూరానికి ఉందని తెలుస్తోంది. ఇటీవల కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ దీన్ని ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ చేశారు. కర్పూరం, లవంగ, వాము, యూకలిప్టస్ ఆయిల్ కొన్ని డ్రాప్స్ ద్వారా ఆక్సిజన్ లెవల్ పెరుగుతుందని తెలిపారు. వీటన్నింటిని ఒక కాటన్ క్లాత్‌లో పొట్లం కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇది లఢాఖ్‌లో ఆక్సిజన్ లెవల్ తక్కువ ఉన్న టూరిస్టులకు హోం రెమిడీగా ఇస్తారు.
కర్పూరం కథ..
19 శతాబ్దంలో ఫార్మాకోపియా థెరపీలో వాడేవారు. కర్పూరాన్ని 13 వ శతాబ్దంలో మార్కోపోలో అని పిలిచేవారు. చైనాలో కూడా సబ్బుల వినియోగంలో కర్పూరాన్ని వాడతారు. కానీ, అమెరికన్ అకాడమీ కర్పూరాన్ని అన్ని మెడిసినల్ వాడకంలో నుంచి తొలగించాలని సూచించింది. లోకల్ ప్రాడక్ట్‌ల వినియోగంలో కర్పూరాన్ని ఉపయోగిస్తునే ఉన్నారు. అనేస్తేషియా, చెస్ట్ కోల్డ్‌కు సంబంధించిన ఇన్‌హెలర్‌లో వాడుతున్నారు.
కర్పూరం ఆక్సిజన్ లెవల్‌ను పెంచుతుందా?
చారిత్రాత్మక ఆధారాలు లేవు అని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. కర్పూరం వల్ల ఆక్సిజన్ లెవల్ పెరగదని, కానీ, శ్వాస సంబంధిత రోగులకు దీన్ని పీల్చడం వల్ల కొద్దిపాటు ఉపశమనం కలుగుతుందని ముంబయి అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ తుషార్ రానే తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్న కర్పూరం కథనాలను గుడ్డిగా నమ్మకూడదని ఆయన అన్నారు. ఇది నమ్మకం మాత్రమే కానీ, దీని గురించిన గట్టి ఆధారాలు లేవన్నారు. కర్పూరం పీల్చడం వల్ల ముక్కులోని నాసల్‌ను ఓపెన్ అవుతాయి. డాక్టర్ సలహాలను పాటించాలి. ఒక్కోసారి ఇటువంటి గుడ్డి ప్రయోగాలు చేసినా అనార్థాలకు దారి తీస్తుందని డాక్టర్ రానే తెలిపారు.