ఉగ్రవాదులకు కీలక ఆదేశాలు… దేశంలో భారీగా దాడులు జరిగే అవకాశం…

-

దేశంలో భారీగా దాడులు జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్ లో దాడుల కోసం ఉగ్రవాదులు కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారి చేసాయి. సైనికులను, స్థానికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. వీటిని ఎప్పటికప్పుడు భారత నిఘా వర్గాలు తిప్పి కొడుతూ వచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ సహకారంతో సరిహద్దు,

గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా భారత నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారి చేసాయి. పాకిస్తాన్ గూడాచారి సంస్థ ఐఎస్ఐ నుంచి ఉగ్రవాదులకు ఆదేశాలు వచ్చాయని తెలిపాయి. ముఖ్యంగా హిస్జ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను భారత్ లోకి భారీగా పంపాలని సూచించినట్టు సమాచారం. జనవరి 26 ని లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దం చెయ్యాలని కాశ్మీర్ లో ఉన్న ఉగ్ర సంస్థలకు ఐఎస్ఐ ఆదేశాలు ఇచ్చిందని… ఇందుకోసం కొందరు ఉగ్రవాదులను నియమించిందని తెలుస్తుంది.

కాశ్మీర్ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, అటు నుంచి దక్షిణ భారతదేశంలోకి కూడా ఉగ్రవాదులు చొరబడే విధంగా చెయ్యాలని… ఆదేశాలు జారి చేసిందని వార్తలు వస్తున్నాయి. లష్కరే తోయిబా కమాండర్ అష్ఫాక్ బర్వాల్ , యూసుఫ్ ఖ్వారీ, జైషే మహ్మద్ ఉగ్రవాది రహమాన్ ఖాన్ లకు ఈ ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తుంది. వారందరూ కూడా భారత్ లో దాడులు చేయడానికి ఇప్పటికే ఒక మ్యాప్ ని కూడా సంస్థకు ఇచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో జమ్మూ మీద కూడా దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది. దీనితో భారత బలగాలు సరిహద్దుల్లో అప్రమత్తమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version