ఇస్లామిక్ తీవ్రవాదులు సౌత్ ఇండియా లో చురుకుగా వున్నారు.. కోయంబత్తూర్, మంగుళూరు పేలుళ్లకి సంబంధం వుంది: IS మౌత్ పీస్

-

కోయంబత్తూరు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. అది జరిగి ఇప్పటికి నాలుగు నెలలు అయ్యింది. ఆ తర్వాత మంగళూరు పేలుళ్లు జరిగి మూడు నెలలు అయ్యింది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) “వాయిస్ ఆఫ్ ఖురాసన్” పత్రిక ద్వారా ఉగ్రవాదులు దక్షిణ భారత దేశంలో ఉన్నారని… ప్రమేయం ఉందని తెలిసింది. రెండు పేలుళ్లు గత సంవత్సరం జరిగాయి. వాటిలో వీళ్ళ హస్తం ఉందని తెలుస్తోంది.

ISKP యొక్క అల్-అజైమ్ మీడియా ఫౌండేషన్ 68 పేజీల సంచిక ని ఆంగ్లం లో రిలీజ్ చేసింది. పత్రిక ద్వారా ‘ముజాహిదీన్లు’ దక్షిణాది రాష్ట్రంలో వుంటున్నారని తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో వున్నారని అలానే వారు తమిళనాడు లేదా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో వుండచ్చని అంటున్నారు.

ఐఎస్‌ అనుబంధ ఉగ్రవాదులే గత సంవత్సరం అక్టోబరు 23న కోయంబత్తూరులో కారు పేలుడు అయ్యిందని.. నవంబర్ 19న మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్‌ పేలుడుని వారే నిర్వహించారని ఐఎస్‌కేపీ అంది.

కోయంబత్తూరు, తమిళనాడు, కర్నాటక, బెంగుళూరు (మంగుళూరుకి బదులు బెంగుళూరు అని వ్రాసారు) లో మన సోదరులు మన మతం గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకున్నారు అని అన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రైడ్ చేసి అరవై చోట్ల వెతికింది. కేరళ, తమిళనాడు మరియు కర్ణాటకలోని చూసాక అప్పుడు రెండు వారాలకి అడ్మిషన్ వస్తుందట.

తాజా సంచికలో ISKP హిందువులు, భారతీయ జనతా పార్టీ, భారత సైన్యంపై విషం చిమ్మింది. దక్షిణ భారతదేశంలోని ముజాహిదీన్లు యుద్ధం చేయడానికి రెచ్చగొట్టింది. అలానే ఈ పత్రిక హిందువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. (as the article termed them enemies of Allah and his Prophet) and also sought to avenge Kashmir (by targeting non-muslims), Babri Masjid, and Gujarat riots. ఇలా ఈ విధంగా వ్రాసింది. అలానే మీ అతిక్రమణ అన్ని హద్దులు దాటిపోయిందని… ఇస్లాం వారు వాళ్లకి వున్న ద్వేషం మాటల్లో చేతలలో చూపబడింది అని పత్రిక లో రాసింది.

వాయిస్ ఆఫ్ ఖురాసన్ అంటే ఏమిటి….?

మధ్య మరియు దక్షిణాసియాలో ISIS కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రచురణ లేదా మౌత్ పీస్ ఇది.
గ్రూప్ తరపున దాడులకు పాల్పడేలా ఇది మద్దతుదారులను రెచ్చగొడుతుంది.
అలానే ISIS మరియు అల్-ఖైదా టెర్రర్ మిషన్లలో చేరాలని యువ తీవ్రవాదులకు చెబుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version