కాపలా కుక్క అని చెప్పి..పిచ్చి కుక్కలా మారాడని తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. “తెలంగాణ ఏర్పాటు తర్వాత కాపలా కుక్కల ఉంటానన్న CM KCR పిచ్చికుక్కలా మారి ప్రజలను కరుస్తున్నారు.
అలాంటి కెసిఆర్ ను తరిమి తరిమి రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని పద్మ నగర్ నుంచి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నగరంలోని నేతన్న చౌక్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.