పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. బెకా లోయలోని బాల్‌బెక్ నగరంపై వైమాణిక దాడులకు పాల్పడగా.. ఓ అపార్ట్ మెంటే లక్ష్యంగా దాడులు చేసినట్లు సమాచారం. ఈ వైమానిక దాడుల్లో 40 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డట్టు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మృతుల్లో ఆరుగురు వైద్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో భవనం మొత్తం ధ్వంసమైందని , శిథిలాల కింద కొందరు చిక్కుకున్నారని తెలిపింది.హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దళాలు ఈ దాడికి పాల్పడినట్టు తెలిసింది. కాగా, దీనిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు బెన్ గురియన్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై క్షిపణి దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది.