పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడి.. 10 మంది మృతి

-

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడికి దిగింది. ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోరమైన ఈ ఘటనపై పాలస్తీనాలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్రాయెల్​తో భద్రతా సంబంధాలను తగ్గించుకోవాలని పాలస్తీనా నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. మరో ఘటనలో 22 ఏళ్ల పాలస్తీనియుడిపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వచ్చే వారం ఈ ప్రాంతంలో చేపట్టనున్న పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పాలస్తీనాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్​ను పేల్చాయన్నారు. ఆస్పత్రిలోని పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పాలస్తీనా అథారిటీ ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టయేహ్ స్పదించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version