కేజీఎఫ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు

-

కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్రా డెవలపర్స్ యజమాని యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కేజీఎఫ్ బాబు ఇంటితోపాటు సంబంధీకుల ఇంటిపై కూడా సోదా చేశారు. వసంతనగర్‌లోని ఆయన నివాసంతోపాటు ఆఫీస్ కార్యాలయాలపై మూడు బృందాలుగా అధికారులు దాడులు చేపట్టారు. కాగా, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. వచ్చే ఏడాది కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

ఉమ్రా డెవలపర్స్ యజమాని యూసుఫ్ షరీఫ్

కేజీఎఫ్‌కు చెందిన ఆయన రెండు దశాబ్దాల క్రితం పాత సామగ్రిలు కొనుగోలు చేసి.. విక్రయాలు చేసేవారు. అలా వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. విధాన పరిషత్ ఎన్నికల సమయంలో కేజీఎఫ్ బాబు ఆస్తి విలువ రూ.1,745 కోట్లుగా చూపించారు. ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల విలువలకు పొంతన లేకపోవడంతో 40 మంది అధికారులతో మూడు బృందాలు ఏర్పడి ఐటీ దాడులు నిర్వహించినట్లు సమాచారం.

2017-18లో రూ.14.89 లక్షలు, 2018-19లో రూ.42.35 లక్షలు, 2019-20లో రూ.49.79 లక్షలు, 2020-21లో రూ.15.86 లక్షల ఆదాయాన్ని గడించినట్లు కేజీఎఫ్ బాబు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. కాగా, బాబుకు ఇద్దరు భార్యలున్నారు. బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో రూ.17.62 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అలాగే స్థిరాస్తులు, నిర్మాణ సంస్థలున్నాయి. ఐటీ రిటర్న్ లలో తక్కువ రాబడి చూపించడమే ఐటీ దాడులకు కారణమని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version