EPFO: పాత కంపెనీ PF అమౌంట్‌ని కొత్త కంపెనీ పాస్‌బుక్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా..?

-

జాబ్‌ మారిన ప్రతిసారి.. ఆఫీసులో పీఎఫ్‌ ఎకౌంట్‌కు యూఏఎన్‌ నెంబర్‌ ఇస్తాం.. అందులో పాస్ బుక్స్‌ మారుతూ ఉంటాయి. మనం ఒక నాలుగు కంపెనీలు మారమంటే.. మన పీఎఫ్‌ అకౌంట్‌లో నాలుగు పాస్‌ పుస్తకాలు ఉంటాయి. ఇలా ఒక్కో దాంట్లో కొంత కొంతం అమౌంట్‌ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల డ్రా చేయాలంటే.. ఏదైనా ఒక్క దానిలో ఆఫ్‌ అమౌంటే వస్తుంది. అలా కాకుండా.. అన్నీ కలిపి మీరు ప్రజెంట్‌ వర్క్‌ చేసే కంపెనీ పాస్‌ బుక్‌లో వేశారనుకోండి.. అమౌంట్‌ పెరుగుతుంది.

డ్రా చేసుకోవడం కూడా సులభం. అయితే చాలామందికి ఈ పీఎఫ్‌ అకౌంట్‌ మీద పెద్దగా అవగాహన ఉండదు.. ఇంట్రస్ట్‌ అసలే ఉండదు. జాయినింగ్‌ అప్పుడు ఆఫీస్‌ వాళ్లు అడుగుతారు.. యూఏఎన్ నెంబర్‌ ఇచ్చేస్తాం.. నెల నెల అమౌంట్‌ అందులో పడుతుంది..చాల్లే అనుకుంటారు.. ఏదైనా పనిపడితే.. అప్పుడు వాళ్లని వీళ్లని అడగటం మొదలేస్తాం..సో.. మనం ఈరోజు.. ఈ పాసుబుక్‌ మనీ ట్రాన్సఫర్‌ విషయం గురించి చూద్దామా..!

మీరు ఉ పాత EPF బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేయడానికి మీరు తప్పనిసరిగా యాక్టివ్ UAN నంబర్, పాస్‌వర్డ్‌ని కలిగి ఉండాలి. దీంతో పాటు మీ UAN నంబర్‌లో బ్యాంక్ ఖాతా నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి అన్ని రకాల సమాచారం అప్‌డేట్ అయి ఉండాలి.

PF ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయండి..?

అందరికీ.. PF సైట్‌లో లాగిన్‌ అవడం తెలిసే ఉంటుంది..కదా. తెలిస్తే డైరెక్టుగా లాస్ట్‌ పేరాగ్రాఫ్‌కు వెళ్లిపోండి….. తెలియకపోతే.. ఇదిగో ఈ స్టెప్‌ చూడండి..
ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లండి.
తర్వాత UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత హోమ్ పేజీలోకి వెళుతారు.
ఇక్కడ సభ్యుల ప్రొఫైల్‌కు వెళ్లండి. మీ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయండి. మీ పేరు, ఆధార్ వివరాలు, పాన్ కార్డ్ ధృవీకరించాలి. ఈ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను నింపాలి.

వ్యూ పాస్‌ బుక్…

ముందు మీరు మీ పాస్‌బుక్‌ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పాస్‌బుక్ కనిపించే వ్యూలోకి వెళ్లాలి. పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు మరోసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
తర్వాత మీరు ఎంచుకున్న సభ్యుల ఐడిపై క్లిక్ చేయాలి.
వెంటనే పూర్తి జాబితా ఓపెన్‌ అవుతుంది.
మీరు పనిచేసిన అన్ని కంపెనీల సభ్యుల IDలు అవే పాస్‌ బుక్స్‌ కనిపిస్తాయి. దిగువన ఉన్న ID మీ ప్రస్తుత కంపెనీకి చెందినది. ఇక్కడ పాస్‌బుక్‌ని చూసి మీ అన్ని కంపెనీలలో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోండి.

పాత EPFని కొత్తదానికి బదిలీ చేయడం ఎలా..?

ఇది అసలు విషయం.. మీ పాత పీఎఫ్‌ని బదిలీ చేయడానికి ముందు కంపెనీ మీ ఎంట్రీ తేదీ, నిష్క్రమణ తేదీని అప్‌డేట్ చేసిందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు సర్వీస్ చరిత్ర ఎంపికపై క్లిక్ చేయాలి. పాత కంపెనీ రెండింటి తేదీలను అప్‌డేట్ చేసినట్లయితే మీ PF సులభంగా బదిలీ అవుతుంది.
ఇప్పుడు మీరు ఆన్‌లైన్ సేవలకు వెళ్లి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఖాతా (బదిలీ అభ్యర్థన)పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత సమాచారం, ఇప్పటికే ఉన్న కంపెనీ PF ఖాతా వివరాలను పొందే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
ఇందులో మీరు పాత PF డబ్బును పొందబోతున్నారు. PF బదిలీ చేయడానికి పాత యజమాని వివరాలు ఉంటాయి. మీరు బదిలీ చేయబోయే PF ప్రస్తుత లేదా పాత యజమాని ఆమోదించాలని గుర్తుంచుకోండి. పాత కంపెనీ యజమాని ఆమోదించడం అంటే కాస్త కష్టమైన పని.. ఇప్పటికే ఉన్న కంపెనీ నుంచి అనుమతి పొందడం సింపుల్‌ కాబట్టి.. ఈ ఎంపికను ఎంచుకోండి.
దీని తర్వాత మీరు మీ UAN వివరాలను ఎంటర్‌ చేయాలి. దీన్ని చేసిన వెంటనే మీ మునుపటి అన్ని కంపెనీల PF ID వస్తుంది. డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న ఐడీని ఎంచుకోండి.
ఆ తర్వాత మీరు దానిని OTP ద్వారా ప్రామాణీకరించాలి.
GET OTPపై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లెయిమ్ విజయవంతమైందని చూస్తారు.
ధృవీకరణ కోసం మీరు ప్రింట్ తీసి మీ కంపెనీకి ఇవ్వాలి లేదా పీడీఎఫ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఆన్‌ లైన్‌లోనే సైన్‌ చేసి మీరు ప్రజెంట్‌ చేస్తున్న కంపెనీకి మెయిల్‌ చేయాలి.. ఇక అక్కడి నుంచి ప్రాసెస్‌ ఆఫీస్‌ వాళ్లు చూసుకుంటారు.
7 నుంచి 30 రోజులలో మీ పాత PF బ్యాలెన్స్ కొత్త ఖాతాకు బదిలీ అవుతుంది.

– Triveni Buskarowthu
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version