ఇలా చేస్తే వానలో తడిసినా జలుబు రాదు..!

-

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేకపోతే జలుబు, జ్వరం వంటివి సులువుగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో వర్షాకాలం మొదలైపోయింది. వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కారణంగా తడిసి పోయే అవకాశం ఉంది.

ఇలా వర్షాకాలంలో వచ్చే వర్షాలలో తడవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వర్షాకాలంలో తడిసిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం. వర్షాకాలంలో కనుక ఈ టిప్స్ పాటిస్తే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.

వర్షంలో తడిసి పోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. అయితే ఇటువంటివి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో తడిసిన వెంటనే బట్టల్ని మార్చుకోండి. ఇలా చేయడం వల్ల బాడీ టెంపరేచర్ తిరిగి నార్మల్ లోకి వెళ్లిపోతుంది. లేదు అంటే ఒళ్ళు చల్లబడి పోయి జ్వరం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

అలానే మీరు బట్టలు మార్చుకున్న తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ ని అప్లై చేసుకోండి. దీనితో బ్యాక్టీరియల్ సమస్య నుండి మీరు సురక్షితంగా ఉండొచ్చు.

వర్షంలో తడిసిన వెంటనే మీరు టవల్ తో తలని శుభ్రంగా తుడుచుకోండి. ఎక్కువసేపు మీ తల తడిగా ఉండడం వల్ల ఈజీగా జలుబు దగ్గు వచ్చేస్తాయి.

అదే విధంగా వర్షంలో తడిసిన వాళ్ళు వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కషాయం లాంటివి తీసుకోండి వీటి వల్ల ఇమ్మ్యూనిటి పెరుగుతుంది. అలాగే టెంపరేచర్ ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఈజీగా ఉండే ఈ టిప్స్ ని అనుసరించడం వల్ల వర్షాకాలంలో తడిసినా అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version