పాపం ఐటి ఉద్యోగులు…!

-

అవును ఇప్పుడు ఐటి ఉద్యోగులను చూస్తే పాపం అనిపిస్తుంది. ఐటి ఉద్యోగాలకు మన దేశంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాని ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య రానున్న రెండు నెలల్లో దాదాపు 3 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇప్పుడు పూర్తి అవుతున్న ప్రాజెక్ట్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ లు ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకి రావడం లేదని తెలుస్తుంది.

ప్రభుత్వాలు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం లేదు. దీనితో సాఫ్ట్ వేర్ కంపెనీలకు వెళ్ళే ప్రాజెక్ట్ లు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు భారీగా పెట్టే ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఇక అమెరికాలో కూడా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే, దీనితో అక్కడి కంపెనీలు కూడా ఇక్కడ ప్రాజెక్ట్ లను ఇవ్వడం లేదు.

దీనితో ఇప్పుడు ప్రముఖ సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు అన్నీ కూడా ఉద్యోగులను టెర్మినేట్ చేస్తూ లేఖలు పంపిస్తున్నాయి. వేలాది మంది ఐటి ఉద్యోగులకు ఈ లేఖలు వెళ్ళాయి. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఈ టెర్మినేషన్ లెటర్ పంపినట్టు సమాచారం. లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత కంపెనీ కి వచ్చి ఫైనల్ అమౌంట్ తీసుకోవాలని సూచనలు ఇస్తున్నాయి.

అదే విధంగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత వారితో కాంటాక్ట్ కట్ చేస్తున్నాయి. అప్పటి వరకు చేసిన వాటికి జీతాలను చెల్లించి తప్పిస్తున్నాయి. దీనితో ఇప్పుడు కోట్ల మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలయింది. ఇన్నాళ్ళు భవిష్యత్తు మీద ధీమాగా ఉన్న ప్రముఖ కంపెనీల ఉద్యోగులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త ఇంటర్వ్యులు కూడా నిర్వహించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version