ప్రతి కుటుంబంలో వరకట్నం అనేది ఎంతలా ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటు మధ్యతరగతి తండ్రికి అయితే తన కూరుతు పెండ్లి చేయాలంటే తలకు మించిన భారమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓ మంచి సంబంధం తీసుకువచ్చి పెండ్లి చేయాలంటే ఎంత కట్నం అడుగుతారో అనే భయమే ఎక్కువ. ఇక గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేయాలంటే ఆస్తులు అమ్మాల్సిందే. మరి ఇంతలా ప్రభావం చూపుతున్న వరకట్నంపై కేరల ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం తమ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా పెండ్లి కాని పురుష ఎంప్లాయిస్ ఉంటే వారంతా వరకట్నాన్ని ప్రొత్సహించొద్దని, కనీసం పెడ్లి చేసుకునే టప్పుడు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు ఈ విషయంపై స్పష్టమైనా ఆదేశాలు జారీ చేస్తూ వారంతా పెండ్లి చేసుకున్న నెల గడువులో వరకట్నం తీసుకోలేదని తాము పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ అధికారులకు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలని చెప్పింది కేరల ప్రభుత్వం.
ఈ డిక్లరేషన్ ఫామ్ నింపేటప్పుడు కచ్చితంగా తాము పెండ్లి చేసుకున్న భార్య సంతకంతో పాటు వధువు తండ్రి సంతకం కచ్చింతగా ఉండాలని చెప్పింది. ఇందుకోసం ఈరోజు కేరళ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జీవోను కూడా విడుదల చేశారు. దీంతో కేరళ సర్కారు నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంబురాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కట్నం తీసుకోవద్దనే ప్రభుత్వ నిర్ణయం చాలా విలువైందని అందరూ కొనియాడుతున్నారు.