జీవితంలో ఈ వ్యక్తులకి దూరంగా ఉంటేనే మంచిది..!

-

ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నది సాధించాలని.. జీవితంలో విజయాల్ని పొందాలని ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల వల్ల కొంత మంది మనుషుల వల్ల దానిని మనం సాధించలేము. అయితే మనం నిజంగా విజయం సాధించాలని అనుకున్నది చెయ్యాలన్నా ఈ మనుషులకు దూరంగా ఉంటే చెయ్యొచ్చని చాణక్య నీతి చెబుతోంది.

 

మరి ఆచార్య చాణక్యుడు ఈ విషయానికి సంబంధించి ఏం చెప్పారు..?, ఎలాంటి వాళ్లతో దూరంగా ఉంటే మంచిదని చెప్పారు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూడు రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్య నీతి చెబుతోంది. పైగా వీరు కనుక మీకు దగ్గరగా ఉంటే మనం అనుకున్నది కూడా చేయలేము. అయితే మరి ఎవరికి దూరంగా ఉండాలి..? ఎవరిని దూరం పెడితే మంచిది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

స్వార్థం:

స్వార్థంతో నడిచే వ్యక్తి మన దగ్గర ఉంటే మనం అనుకున్నది సాధించ లేము. అలానే వాళ్ళని అస్సలు నమ్మకూడదు కూడా. కాబట్టి స్వార్ధంగా ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి. లేదంటే మీరే నష్టపోతారు.

కోపంతో ఉండే వ్యక్తి:

ఎక్కువ కోపంతో ఉండే వ్యక్తి కి కూడా దూరంగా ఉండటం మంచిది లేదు అంటే మీరు చేసే పనిలో అడ్డంకులు మాత్రమే ఉంటాయి.

అధికంగా పొగిడే వ్యక్తి :

బాగా పొగిడే వ్యక్తి కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్య అంటున్నారు. కాబట్టి ఈ మూడు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీనివల్ల మీరు ఏ మాత్రము నష్టపోకుండా ఉంటారు.

కోపంతో ఉన్న వాళ్లు ఎప్పుడూ కూడా పదునైన ఆయుధాలు ఉన్న వ్యక్తి గా భావిస్తారు. అందుకే వాళ్లని దూరం పెట్టాలి. స్వార్ధంతో ఉన్న వాళ్లు ఎప్పటికైనా ప్రమాదకారి. అలానే పొగిడేవారు మనకి అత్యంత పెద్ద శత్రువులు. కాబట్టి వీరికి దూరంగా ఉంటేనే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version