మహమ్మారి సమయంలో ఈ పనులు చేసేటప్పులు చేతుల్ని కడుక్కోవడం చాలా ముఖ్యం…!

-

దేశమంతటా కూడా కరోనా వైరస్ తో సతమతమవుతోంది. ఈ మహమ్మారి కారణంగా జనం ఇళ్ల నుంచి కూడా బయటకు రావడం లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం పదే పదే చేతుల్ని శుభ్రం చేసుకోవడం శానిటైజర్ ని ఉపయోగించడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాల్సి వస్తోంది.

సులువుగా ఏ వ్యాధి రాకుండా ఉండాలంటే సబ్బు తో లేదా హ్యాండ్ వాష్ తో చేతులు శుభ్రం చేసుకుంటే వ్యాధి రాకుండా ఉండడానికి వీలవుతుంది. ముఖ్యంగా హైజీన్ గా ఉంటే ఎటువంటి సమస్యలు రావు. పలుమార్లు మీ చేతులు మీ పిల్లల చేతులు శుభ్రం చేస్తూ ఉండండి. నిజంగా ఇలా చేయడం చాలా ముఖ్యం.

ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చేతులు. పదే పదే చేతులు కడుక్కోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.. అదే విధంగా సరిగ్గా చేతులు ఎలా కడుక్కోవాలి..?, ఎప్పుడు కడుక్కోవాలి అది కూడా చూద్దాం.

తప్పకుండా ఈ పనులు చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి:

వంట చేస్తున్నప్పుడు లేదా కూరగాయలు, పండ్లు కట్ చేసే ముందు.
ఏదైనా తినేటప్పుడు.
అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు.
ఏదైనా గాయాలకి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు.
మీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత ఇలా ఈ పనులు చేసేటప్పుడు తప్పకుండా చేతులు కడుక్కోండి.
అలాగే ఆహారం వండిన తర్వాత వెంటనే మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి.
ఏదైనా పెంపుడు జంతువులని లేదా వాటి ఆహారాన్ని పట్టుకున్నప్పుడు మరియు ఇంట్లో ఉండే చెత్తని పట్టుకున్నప్పుడు.
డైపర్ మార్చిన తర్వాత టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి.
చేతులు అడ్డం పెట్టుకుని తుమ్మినా, దగ్గినా కూడా చేతులు కడుక్కోవాలి.

చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి…?

చేతులు శుభ్రం చేసుకోవడానికి మీరు సోప్ మరియు నీళ్ళని వాడండి. ముందు మీ చేతుల్ని నీళ్లతో తడి చేసుకోండి. ఇప్పుడు సోప్ లేదా హ్యాండ్ వాష్ చేతి లో వేసి 20 సెకన్ల పాటు రుద్దండి వేళ్ల సందుల్లో అలానే చేతిని మొత్తం శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు శుభ్రమైన టవల్ తో మీ చేతుల్ని తుడవండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version