పెరుగుతో పాటు వీటిని తీసుకుంటే ఎంతో మంచిది..!

-

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి, కాల్షియం మరియు ఇతర మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకుంటుంది. పెరుగులో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి.

ఇది మంచి బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది అలానే చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. అయితే పెరుగు తో పాటు ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు పోషకపదార్థాలు మీకు అందుతాయి. అయితే మరి ఏ ఆహార పదార్ధాలు పెరుగుతో పాటుగా తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలోచనలు లేకుండా దీనికోసం చూసేయండి.

పెరుగు మరియు డ్రై ఫ్రూట్స్:

పెరుగు తో పాటుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మీకు ఎనర్జీ తక్కువగా అనిపించినప్పుడు దీన్ని తీసుకుంటే కచ్చితంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలానే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాలు నచ్చనివాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చు.

పెరుగు మరియు బెల్లం:

పెరుగు తో పాటు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఆకలి వేసినప్పుడు దీనిని తీసుకుంటే వెంటనే ఆకలి తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ ని కూడా ఇది బాగా మెయింటెన్ చేస్తుంది. పెరుగుతో పాటు బెల్లం తీసుకోవడం వల్ల ఎనీమియా సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలానే హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.

పెరుగు మరియు జీలకర్ర:

ఆకలి లేదు అన్న ఫీలింగ్ నీకు కలిగినప్పుడు పెరుగుతో పాటు జీలకర్ర తీసుకోండి. దీనివల్ల అజీర్తి తగ్గుతుంది. కొద్దిగా సాల్ట్ ని కూడా దీనిలో వేసుకుని తీసుకో వచ్చు. ఇలా చేస్తే డైజేషన్ అవుతుంది. అలాగే ఆకలి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు అలానే చాలా సమస్యలకు చెక్ పెట్టచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version