Breaking : కొంపల్లిలోని సంతోష్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

-

నిన్న ఉదయం నుంచి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంపల్లిలోని సంతోష్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు సంతోష్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. నిన్నటి నుంచి కొంపల్లిలోని సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సోదాలు ముగియడంతో సంతోష్ రెడ్డి ఇంటి నుంచి అధికారులు వెళ్లిపోయారు. కీలక డ్యాక్యుమెంట్లు…. అయితే సంతోష్ రెడ్డి ఇంటి నుంచి నాలుగు కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఇక్కడ లభ్యమయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఐటీ అధికారులు చేర్పించారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డి సైతం ఈ ఐటీ సోదాలతో అస్వస్థతకు గురికావడంతో ఆయనను కూడా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version