కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని, ఇక నుండి అలా కుదరదని కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నేను కూడా ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు, ఆకస్మిక తనిఖీలు చేస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు .
ఇకపై ప్రతీ నెలా అన్ని డిపార్ట్‌మెంట్ల సెక్రటరీలతో సమావేశం ఉంటుందని తెలిపారు.వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పని చేస్తే కుదరదని హెచ్చరించారు. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుందని అన్నారు. ఈ నెల 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుతో భేటీ, నెల చివర్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.