మూడోసారి కూడా విచారణకు కాకాణి గోవర్ధన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పటికే మూడుసార్లు కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు… విచారణకు రావాలని కోరారు. ఇవాళ హైకోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు ఐంది. ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ జరిగింది. అయితే విచారణ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వస్తారంటూ ప్రచారం జరిగింది.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాల కేసులో A4 గా ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పొదలకూరులో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు ఐంది. కాగా తాటిపర్తిలో రూ. 250 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని మూడోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కానీ మూడోసారి కూడా విచారణకు కాకాణి గోవర్ధన్ రెడ్డి డుమ్మా కొట్టారు.