కూల్చడంలో ఉన్న తృప్తి మీకు వేరే ఎందులోనూ కనిపించకపోవడం ఏపీ దురదృష్టం – చంద్రబాబు

-

వైయస్సార్ జిల్లా కడప నగరంలోని అన్నా క్యాంటీన్ ను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రూ. 35 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ నుు నిర్మించారు. ఆరు నెలల క్రితమే దీనిని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేస్తుండగా టిడిపి నేతలు అడ్డుకున్నారు.

అయితే మిగిలిన నిర్మాణాలను మంగళవారం కూల్చివేస్తున్నట్లు తెలుసుకొని టిడిపి నేతలు అడ్డుకోగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు మండిపడ్డారు. ” కూల్చడంలో ఉన్న తృప్తి మీకు వేరే ఎందులోనూ కనిపించకపోవడం ఏపీ దురదృష్టం. నిర్మించడం ఎంత కష్టమో, కూల్చడంతో ఎంత నష్టమో తెలుసుకునే సమయం కూడా ఇక మీకు లేదు. ప్రభుత్వ ఆలోచనలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవేదన చెందుతున్నారు. ఇవి మీకు, మీ ప్రభుత్వానికి ఎన్నటికీ అర్థం కావు”. అన్నారు నారా చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version