శత్రువుల్ని దెబ్బతీయటానికి మన దగ్గర అయితే అధునాతన ఆయుధాలు ఉన్నాయి. రష్యా సైన్యం శత్రువల్ని చావుదెబ్బతీయటానికి ఓ చిత్రమైన ప్లాన్ వేసింది. అదే ఈ రాయి కాన్స్పక్ట్. రోబోరాయి చూడటానికి రాయిలా ఉంటుంది. కానీ అది వీడియోలు తీస్తుంది. మన మాటలు వింటుందట. ఈ రాయిరోబో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఓ 10 కేజీల రాయి ఎంత ఉంటుందో ఈ రోబోరాయి కూడా అంతే ఉంటుంది. బరువు తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది నిజమైన రాయి కాదు కాబట్టి. దీనికి కింద 12 చక్రాలు ఉంటాయట. పైన ఓ స్పై వీడియో కెమెరా ఉంటుంది. రష్యా సైనికులు ఇలాంటి రాళ్లను సరిహద్దుల వెంట వదిలుతారు..అప్పుడు అవి ఆ చక్రాల ద్వారా అవి… శత్రువుల దగ్గరకు వెళ్తాయి. చూడటానికి రాయిలా ఉంటుంది కాబట్టి… శత్రువులకు అది రోబో గుర్తుపట్టలేరు. కాబట్టి వారు తమ ప్లాన్స్ మాట్లాడుకుంటారు. బాంబులు రెడీ చేసుకుంటూ ఉంటారు. అదంతా ఈ రాయి వీడియో తీస్తుంది. వాళ్ల మాటల్ని రికార్డ్ చేస్తుంది. ఆ డేటా మొత్తాన్నీ రష్యా సైనికులు… ప్రత్యేక వార్ రూంలో కూర్చొని చూస్తూ… శత్రువుల్ని ఈజీగా దెబ్బతియ్యగలరు. ఇది రష్యా సైనికుల వేసిన ప్లాన్.. యుద్ధం అయిపోయాక… ఎక్కడెక్కడ రోబో రాళ్లు ఉన్నాయో వాటిని తిరిగి పట్టుకుపోతారు.
ఈ స్పై రోబోలకు సంబంధించి రష్యాకి చెందిన జ్వెజ్దా న్యూస్ ఛానెల్… న్యూస్ ఇచ్చింది. ఇది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఛానెల్. ఆ న్యూస్‌లో ఓ రష్యా సైనికుడు రాయిని తెచ్చి… ఓ రోడ్డు పక్కన వదిలాడు. ఆ సమయంలో అక్కడ విపరీతంగా మంచు ఉంది. అతను రాయిని వదిలేసి… కొంత దూరం వెళ్లగానే… రాయి కింద చక్రాలు తెరచుకున్నాయి. రాయి పైన స్పై కెమెరా పైకి లేచింది. తర్వాత రాయి చక్రాలతో ముందుకు వెళ్లింది. అది ఓ చోటికి వెళ్లి… అక్కడ తిరిగి రాయిలా ముడుచుకుపోయి ఉంది.
“ఇది రోబో అని ఎవరికీ తెలియదు. ఎటు కావాలంటే అటు తిరగగలదు. దీన్ని చేత్తో పట్టుకెళ్లవచ్చు. ఇది యుద్ధంలో బాగా ఉపయోగపడుతుంది” అని జ్వెజ్దా న్యూస్ లో తెలిపారు. రాయిలో మోషన్ సెన్సార్ రోబో ఉంది. ఈ రోబోకి ఉన్న బ్యాటరీలు 24 గంటలపాటూ పనిచేయగలవు. తద్వారా రోబోకి ఉన్న కెమెరా… 15 గంటల పాటూ సమాచారాన్ని సేకరించి సైన్యానికి పంపగలదు. అయితే ఈ రోబో ని ఎక్కడో రూంలో ఉండి ఆపరేట్ చేయలేరు.. ఆపరేట్ చేసే వ్యక్తి… దానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిందేనట.
దక్షిణ రష్యా నగరం వొరొనెజ్‌లో జ్యుకోవ్‌స్కీ-గగారిన్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీ ఉంది. అక్కడి ప్రొఫెసర్లు, విద్యార్థులూ కలిసి… మూడేళ్లపాటూ కష్టపడి ఈ రోబో రాయిని తయారుచేశారు.
రష్యా ఈ వీడియో బయటకు చెప్పడంతో..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. రాయికదులుతుంటే ఎవరూ ఒకరు చూస్తారు కదా, అవసరం లేని చోట రాళ్లు ఉంటే తీద్దామనే ఉద్దేశంతో అయినా ఈ రోబో రాయిపై కన్నుపడుతుంది కదా అనే సందేహాలు నెటిజన్లకు వస్తున్నాయి. మీరు కూడా ఈ లింక్ ద్వారా ఆ రోబో రాయి ఎలా పనిచేస్తుందో చూడండి. https://tvzvezda.ru/news/202111261748-YvgtU.html/player/