న్యూజిలాండ్ ప్రధానిగా మరోసారి జసిండా ఆర్డెర్న్‌కు.. అక్కడి ప్రజలు పట్టంకట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో… జసిండా నేతృత్వంలోని సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో సమర్థంగా వ్యవహరించిన ఆమెకు అక్కడి ప్రజలు రెండోసారి అధికారం అప్పగించారు.
న్యూజిలాండ్‌లో మరోసారి లెఫ్ట్ లేబర్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ప్రధానిగా జసిండా ఆర్డెర్న్‌పై మరోసారి విశ్వాసం ఉంచి ఆదేశ ప్రజలు… ఘన విజయం అందించారు. 70శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్ ఓటమిని అంగీకరించడం విశేషం.మూడింట రెండొంతుల ఓట్లు లెక్కించే సరికే ఆర్డెర్న్‌కు చెందిన లేబర్ పార్టీ 49.2 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 120 సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ 64సీట్లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు.