వైరల్ వీడియో : తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు..!

-

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో కర్ణాటక రాష్ట్రం అంతా జలమయం అయ్యాయి. అలానే కర్ణాటకలో అనేక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. బీజాపూర్‌ జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు తరిలారు. ఇటువంటి తరుణంలో ఓ శునకం మాతృత్వానికి సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయింది.

నీటిలో పూర్తిగా తడిసిపోయి చావుబతుకుల మధ్య ఉన్న తన చంటి బిడ్డను నోట కరుచుకున్న ఆ శునకం.. సురక్షితంగా దాన్ని మరో గుడిసెలోకి తీసుకెళ్లింది. కొంచెం ఎత్తయిన ప్రాంతంలో తన బుల్లి కుక్కపిల్లను వదిలి వెళ్ళింది. తారాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. మాతృ ప్రేమకు జాతి లేదని, శునకం అయినా తన తల్లి ప్రేమకు ఎటువంటి లోటుండదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మనుషుల్లోనే మానవత్వం తగ్గిపోయిందని, జంతువుల్లో ఎప్పుడు తగ్గదు సరికదా కొదవ ఉండబోదని ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version