నల్లగొండలో బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వంటి నేతల అరెస్ట్ పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది. మంత్రి వెంకట్ రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫోటో చూసినా గులాబీ రంగు చూసినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బయమైతుంది. మున్సిపాలిటీ అధికారులు కావాలనే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. వెంకట్ రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవు. మాజీ ఎంఎల్ఏ భూపాల్ రెడ్డిని అరెస్ట్ అక్రమం. బేషరతుగా భూపాల్ రెడ్డిని, పార్టీ శ్రేణులను విడుదల చేయాలి.
మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాపై కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడు. చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా భయపడుతుంది. కాంగ్రెస్ రహిత తెలంగాణా కోసం నల్లగొండ నుండే ఉద్యమం మొదలు అవుతుంది. కాంగ్రెస్ హఠావో తెలంగాణా బచావో నినాదం మొదలైంది. రెండు సార్లు ప్రజల దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వారిని వదిలి అర్హత లేని వారికి లబ్ది చేస్తున్నారు. కాంగ్రెస్ మోసాల పై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.