జగన్ ముందుచూపు చూసి మోడి కూడా దండం పెట్టాల్సిందే ?

-

వైయస్ జగన్ పరిపాలన దేశవ్యాప్తంగా తొమ్మిది నెలల్లోనే హైలెట్ గా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ ఇంకా అనేక కార్యక్రమాలు ఇంటివద్దకే రావడంతో చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఏపీలో ఉన్న ప్రభుత్వ విధి విధానాల గురించి తెలుసుకుంటున్నారు. ఇదే తరుణంలో 9నెలల్లోనే దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం గా జగన్ మూడో స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పరిపాలన అన్నట్టుగా రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ఇంకా అనేక కార్యక్రమాలు జగన్ చేపట్టబోతున్నారట. ముఖ్యంగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రతి గ్రామంలో అమలు చేయబోతున్నారని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 11 బోధనాసుపత్రులను 27కు పెంచనున్నారు. విద్యా వ్యవస్థలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరిగేందుకు పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి, విద్యా వసతి పథకాలు అమలు చేయ‌నున్నారు.

 

దాదాపు నాలుగు సంవత్సరాల ముందు చూపుతో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలే గాని పెట్టుబడులే గాని పక్క ప్లానింగ్ చేసుకుని సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట. ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు మరియు ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కలగకుండా చాలా చర్యలు ఆది నుండి తీసుకుంటున్నారు. దీంతో జగన్ ముందు చూపు చూసి ప్రధాని మోడీ కూడా దండం పెట్టాల్సిందే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version