జగన్ ని డమ్మీని చెయ్యాలని చూస్తున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని డమ్మీ ని చెయ్యాలని చూస్తున్నారా…? ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పడం వెనుక వ్యూహం ఏంటీ…? రాజకీయంగా వైసీపీ అత్యంత బలంగా ఉంది. ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం జగన్ కి ఉంది. ఇప్పుడు ఆయన బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కొందరు టార్గెట్ చేసిన విధానం ఆందోళన కలిగిస్తుంది.

“నేను కేంద్ర అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను” రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ మీడియాకు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశం ఇది. అంటే, కేంద్ర అధికారులు, కేంద్ర పెద్దలు జగన్ ని టార్గెట్ చేసారు. అంత నిజాయితీ ఉన్న అధికారి అయితే ఎన్నికలను రద్దు చేసి కరోనా పోయిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం విచక్షణాదికారాలు అంటూ మాట్లాడి… అధికారులను బదిలీ చేయడం, ఏకంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఎంత వరకు సమంజసం. కనీసం ప్రభుత్వం తో ఒక్క మాట కూడా చెప్పకుండా కేంద్ర పెద్దల ఆదేశాలతో రాష్ట్రంలో కొన్ని శక్తుల ప్రభావం తో విడుదల చేసిన ప్రకటన ఎన్నికల వాయిదా అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది అన్నారు.

అంటే ఈ ఆరు వారాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే డమ్మీ గా ఉన్నట్టు కదా. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. అంటే జగన్ ని కచ్చితంగా డమ్మీని చేయడమే ఇది. ఎన్నికల కోడ్ ఒక రాష్ట్రంలో ఆరు వారాల పాటు ఏ విధంగా అమలులో ఉంటుంది…? ఎన్నికలు జరిగితే అమలులో ఉన్నా తప్పు లేదు. కాని పరిపాలన స్తంభింప చేసారు. కచ్చితంగా దీని వెనుక కుట్ర ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అంటున్నారు పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version