గత ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఇందులో సగంపైనే ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్‌తోనే గెలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు చాలామంది ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలకు పెద్దగా అవగాహన కూడా లేదు. కానీ జగన్ బొమ్మ చూసి ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు.
ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. ఏదో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో వారు బండి లాగించుకుని వచ్చేస్తున్నారని తెలుస్తోంది. పైగా కొందరు ఎమ్మెల్యేలు ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ఎక్కువగానే చేశారని తేలిందట. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు నిర్వహించడంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారట. మొత్తానికి చూసుకుంటే ఓ 50 మంది పైనే ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకిత వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక వీరు గానీ వచ్చే ఎన్నికల్లోపు పికప్ కాకపోతే, జగన్ సీటు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. జగన్ కూడా ఈ సారి పార్టీ గెలవాలంటే..ఇలాంటి ఎమ్మెల్యేలని పక్కనబెట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికైతే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు జగన్ ఈ సారి చెక్ పెట్టేయడం ఖాయమనే చెప్పొచ్చు.