తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ గుండెల మీద తన్నాడు : ఈటెల పై హరీష్ ఫైర్

-

హుజురాబాద్ : తండ్రి లాంటి కేసీఅర్ ను తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ నీ గుండెల మీద తన్నింది ఈటల రాజేందర్ అని..  అన్నం పెట్టి అక్షరాలు నేర్పిస్తే.. రెండు సార్లు మంత్రి ఇస్తే.. ఆరెయ్ కేసీఆర్, ఆరెయ్ హరీష్ అంటుండని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బిజెపిలోకి వెళ్ళి భాష మార్చాడని… ఓటమి భయంతో మాటాలు తూలుతున్నాడని నిప్పులు చెరిగారు. ఇవాళ ఆయన హుజురాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సింది అభివృద్ది, సంక్షేమమని.. ఆత్మ గౌరవం గురించి మాట్లాడి ఈటెల ఆత్మ వంచన చేసుకున్నాడన్నారు.

ఈటెల గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని.. మంత్రిగా పని చేయని ఈటెల ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం చేస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం పథకాలు తెచ్చిందో చెప్పాలన్నారు. రాజేందర్ రైతు బంధు వద్దు అంటున్నారని.. మనం ఏం చేయాలనేది మీ చేతిలో ఉందన్నారు. ఆసరా పెన్షన్ రైతుభందు, కళ్యాణ లక్ష్మి పథకాలను ఈటల వద్దు అంటున్నారని నిప్పులు చెరిగారు. రైతు బంధు వద్దని ఈటెల రాజేందర్.. రూ.10లక్షల 50వేలు తీసుకున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version