జగన్ వేసిన ఈ పంచ్ 24 గంటల తరవాత కూడా ఏపీ – తెలంగాణ వాట్సాప్ లలో వైరల్ అవుతోంది..!!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల రూపురేఖలను రాబోయే రోజుల్లో పూర్తిగా మార్చబోతున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉండేలా త్వరలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకు ఎంత మంచి పని చేసినా తక్కువే అని అనటంలో మరియు భావించే వ్యక్తులలో మొదటి వాడిని నేనే అన్నారు. పేద ప్రజల కోసం మరియు ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

ప్రతి పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ హాస్పిటల్ లో లేడు అన్న భావన రాకూడదనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు జగన్ తెలిపారు. ఇటువంటి మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే కొందరికి చూడబుద్ది కావడంలేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు జగన్.. క్యాన్సర్ వస్తే ఆరోగ్య శ్రీలో చికిత్స ఉంది. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా చికిత్స లేదు. కంటిచూపు మందగిస్తే కంటివెలుగులో చికిత్స ఉంది కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడ కూడా చికిత్స లేదు.

 

ఇక వయసు మీదా పడి అనారోగ్యం పాలైతే చికిత్స ఉంది. కానీ మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేదని అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొంతమంది ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయని వాళ్ళను బాగుచేసే మందులు ఎక్కడ కూడా లేవని జగన్ వేసిన డైలాగ్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వాట్సాప్ లలో ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఇదే సందర్భంలో ఆ వీడియో ని కట్ చేసి సోషల్ మీడియాలో షేర్లు మీద షేర్లు కొడుతున్నారు వైసిపి పార్టీ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version