ఆంధ్రప్రదేశ్ లోని హాస్టల్ విద్యార్ధులకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఈ రోజు మన బడి నాడు నేడు పధకం మీద ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నాటికి నాడు నేడు తొలి దశ పనులు పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెండో దశ పనులలో భాగంగా హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక బ్యాగ్, షూ, పుస్తకాలు ఇలా పిల్లలకు ఇచ్చే ప్రతి వస్తువులో కూడా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు అని ఆయన అధికారులని ఆదేశించారు.
అంతే కాక ఇక మీదట హాస్టల్స్ లో కూడా జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించాలని ఆయన ఆదేశించారు. అలానే ఇక మీదట హాస్టల్ విద్యార్ధులకి కూడా మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రస్తుతం 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేవని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు.