ఏపీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు వచ్చే నెల ఒకటినే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గతంలో జీతాల చెల్లింపులు ఆలస్యం కావడానికి కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
సంక్షేమ పథకాలకు నిధులకు సర్దుబాటు చేయడం వల్ల గతంలో జీతాల చెల్లింపు ఆలస్యమైందన్నారు. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఉద్యోగుల మద్దతు తెలపాలన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీఆర్సి బకాయిలను ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోగా రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల జిపిఎఫ్ అడ్వాన్సులు, ఏపీజీఎల్ఐ క్లేయిములు కలిపి సుమారు రూ.3వేల కోట్లను ఈ నెలాఖరులోగా చెల్లిస్తుందని తెలిపారు.