ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా రాజ్యసభ స్థానాలు ఎవరికి వస్తాయి అనే ఉత్కంట ఎక్కువగా నెలకొంది. నాలుగు స్థానాలు మార్చ్ లో కాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ నాయకులే అవకాశం దక్కించుకుంటారు. దీనితో జగన్ ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆరేడు పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.
చిరంజీవి, అయోధ్యరామి రెడ్డి, షర్మిల, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇలా చాలా పేర్లు ఇప్పుడు వినపడుతున్నాయి. దీనితో వారిలో రాజ్యసభకు వెళ్ళే నలుగురు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ. ముఖ్యంగా చిరంజీవి, బీదా మస్తాన్ రావు, ఉమ్మారెడ్డి వెళ్ళడం ఖాయంగా కనపడుతుంది. మరి మరొకరు ఎవరు అనేది చర్చ జరుగుతుంది.
ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య పరిశ్రమలకు సంబంధించిన చర్చతో పాటుగా రాజ్యసభ సీట్ల చర్చ కూడా వచ్చింది. రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది అంటున్నారు. ఝార్ఖండ్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన నత్వానికి,
రాజ్యసభ సీటు ఇవ్వడానికి జగన్ ని అంబాని కలిసారు. ఆయనకు అంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన పదవీ కాలం ఏప్రిల్ తో ముగుస్తుంది. దీనితో ఆయనకు రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు. అంబాని పరిశ్రమల విషయంతో పాటుగా ఇదే ప్రధాన ఎజెండా గా అయన వచ్చారట. అంబాని అడిగారు కాబట్టి అది ఖరారు అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.