ఏపీలో వృద్ధులకు శుభవార్త. పెన్షన్ల పంపిణీపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలిముద్రల సమస్య తలిత్తే అవ్వతాతలకు ఆధార్ అనుసంధానంతో కూడిన లబ్ధిదారుని ముఖాన్ని, అదే యాప్ లో సరిపోల్చుకొని పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని వాలంటీర్లను ఆదేశించింది.
మార్చి ఒకటి నుంచి పంపిణీ చేసే పెన్షన్లలో ఈ విధానం అమల్లోకి రానుండగా, ఇప్పటికే అమలులో అన్ని విధానాలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు తీపి కబురు అందించడంతో.. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.