సాగు నీటి ప్రాజెక్టుల పై సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని ఆయన అన్నారు. పోలవరానికి సంబంధించి ప్రతీ పనిలో కూడా ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని అన్నారు. రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌ల కార్యాచరణ సిద్దం చేయండన్న ఆయన రెండో విడత ప్రాధాన్యతగా ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లపైనా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్పిల్ వే రోడ్ పనులు పూర్తి కానున్నాయి.
స్పిల్‌ఛానల్‌లో వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నాటికి రేడియల్ గేట్లను అమర్చే ప్రక్రియ పూర్తి కానున్నది. మే నాటికి అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేయటం లక్ష్యంగా చెబుతున్నారు. డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోండని జగన్ పేర్కొన్నారు. అనుమతులకోసం ప్రత్యేకించి ఒక అధికారిని కేటాయించండని ఆయన ఆదేశించారు. సిలెండర్ల దిగుమతిలో ఆలస్యం లేకుండా చూడాలని ఆదేశించారు జగన్.