వాళ్ళ అందరికి పరిక్షలు నిర్వహించండి… అధికారులకు జగన్ ఆదేశాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. ఇన్నాళ్ళు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో మత ప్రార్ధనలకు హాజరైన వారి విషయంలో ఇక కఠినం గా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అక్కడ హాజరైన వారికి వారితో కాంటాక్ట్ అయిన వారికి,

పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని, పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని, వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని అధికారులకు జగన్ సూచించారు.

ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మంది పాజిటివ్‌గా కేసులుగా నిర్ధారణ అయ్యారని అధికారులకు ఆయన వివరించారు. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్‌ నుంచి ఫలితాలు రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. దొరకని వారిని వెంటనే పట్టుకోవాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version