ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఊహించని విధంగా కేసులు నమోదు కావడంతో ప్రపంచం ఒక్కసారిగా భయానికి గురవుతుంది. గత పది రోజుల్లో కరోనా కేసులు ఆరు లక్షలు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఈ స్థాయిలో రెచ్చిపోతుంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని దేశాల్లో కరోన వైరస్ వేగంగా విస్తరిస్తుంది.
అమెరికాలో పది రోజుల్లో కరోనా కేసులు దాదాపుగా రెండు లక్షలు పెరిగాయి అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటలీ, స్పెయిన్ కన్నా అమెరికాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జర్మని, ఫ్రాన్స్ లో కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కనీసం శవాలను కూడా కాల్చి వేసే పరిస్థితి లేదు. అసలు పరిక్షలు చేయలేక వైద్యులు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉందనే విషయం అర్ధమవుతుంది.
లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరి అయిపోతుంది. చైనా కరోనా నుంచి బయటపడినా సరే అక్కడ ఇంకా కరోనా వ్యాప్తి ఉంది. నిదానంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం బీజింగ్ లో ఈ కేసులు నమోదు అవుతున్నాయి. మన దేశం విషయానికి వస్తే రోజు వంద కేసులు నమోదు అయ్యేది గురువారం నుంచి 400 కేసులు నమోదు అయ్యే వరకు పరిస్థితి వెళ్ళింది.
ఢిల్లీ మర్కాజ్ యాత్రకు వెళ్ళిన వారి నుంచి ఈ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఏకంగా 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు లో 300 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక మరణాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 50 వేలు దాటింది. దీనితో అన్ని దేశాల ప్రభుత్వాలు దీన్ని ఎదుర్కోవడానికి సతమతవుతున్నాయి.