ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోయే టైంలో అనూహ్యంగా ఎలక్షన్లు వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఎన్నికల కమిషన్ సంచలన ప్రకటన చేసింది. ప్రజలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలని ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు.
ఇటువంటి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడటంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు…కరోనా గురించి ఆలోచించి జగన్ యే వాయిదా వేయించాడు మన ఆరోగ్యాల కోసం బాగా ఆలోచిస్తున్నాడు అని బలంగా నమ్ముతున్నారు. దీంతో ఈ పరిణామం కొంచెం జగన్ కి లోకల్ ఎలక్షన్ లో పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.