ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరణం బలరాంకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందిరా గాంధీ ప్రధాని అయిన నాటి నుంచి కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇందిరా గాంధీ ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తే ఆయన ముందు ఉండి కాన్వాయ్ ని నడిపించారు అని చెప్తారు. అలా ఆయన జాతీయ రాజకీయాలకు కూడా పరిచయం అయ్యారు. ఇక ఎన్టీఆర్ పిలుపు తో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన.
అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రకాశం జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు అంటే యువనేతలు వచ్చారు గాని, అప్పుడు మొత్తం ఆయనే జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన ఏ ఒక్కసారి కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా పార్టీ అధికారం కోల్పోయింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు.
ఇక ఇది పక్కన పెడితే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన టీడీపీ ని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు జగన్ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారట. అద్దంకి సీటు కోసం కరణం బలరాం ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి మళ్ళీ గొట్టిపాటి రవి కుమార్ కే సీటు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.
దీనితో ఆయన టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన కండువా కప్పుకోకపోయినా తన కుమారుడు కరణం వెంకటేష్ కి మాత్రం జగన్ తో కండువా కప్పించారు. కరణం కుటుంబానికి అద్దంకి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. దీనితోనే ఆయన సీటు హామీ తోనే పార్టీలోకి వెళ్ళారని అంటున్నారు. మరి జగన్ ఆ సీటు ఇస్తారా లేక చీరాల నుంచే కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.