బ్రేకింగ్; అగ్ర నటుడు కన్నుమూత…!

-

గబ్బర్ సింగ్ అనగానే మనకు ఎవరు గుర్తుకు వస్తారు…? క్రికెట్ లో శిఖర్ ధావన్, సినిమాల్లో అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళు ఇద్దరూ తమ స్టైల్ తో, తమ సినిమాలతో గబ్బర్ సింగ్ లు అయ్యారు. కాని నిజమైన గబ్బర్ సింగ్ ఒకరు ఉన్నారు అనేది చాలా మందికి తెలియదు. షోలే సినిమాలో విలన్ పేరు గబ్బర్ సింగ్. షోలే సినిమాలో విలన్ గా నటించిన అంజాద్ ఖాన్ గబ్బర్ సింగ్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆ సినిమాలో ఆ పాత్ర సూపర్ హిట్ అయింది. దీనితో అక్కడి నుంచి కాస్త భిన్నంగా ఉండే వాళ్ళు అందరూ కూడా గబ్బర్ సింగ్ అని కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పక్కన పెడితే ఆ గబ్బర్ సింగ్ తమ్ముడు ఇప్పుడు చనిపోయాడు. గబ్బర్ సింగ్‌గా ఫేమసైన బాలీవుడ్ నటుడు అమ్జద్ ఖాన్ సోదరుడు ఇంతియాజ్ ఖాన్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చాలా సినిమాల్లో ఆయన నటించారు.

నటుడిగా కీలక పాత్రలు చేసారు. ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ సినిమాల్లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్న ప్రోత్సాహం తో సినిమాల్లోకి వచ్చిన ఆయన ఆ తర్వాత సొంతగా ఎదిగే ప్రయత్నం చేసారు. అగ్ర హీరోలతో సినిమాలు చేసారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version