దేవాదాయ భూమి సాగుదారులకు జగన్‌ సర్కార్‌ తీపికబురు…!

-

ఏపీలోని దేవాదాయ భూమి సాగు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్‌ సర్కార్‌. ఇవాళ వైయస్సార్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా ఏడో ఏడాది కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా నిధులను అందించనున్నారు.

సిసిఆర్సిలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది కౌలుదారులతో పాటు 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లను జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా బటన్‌ నొప్పి.. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version