ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తనదైన కొత్త తరహా పాలనని అందించడానికి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల హామీలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేస్తూ అత్యంత ప్రణాలికా బద్దంగా పాలన సాగిస్తున్నారు. అంతేకాదు పాలనవైపు దృష్టి పెడుతూనే చంద్రబాబు హాయంలో చేసుకున్న ఒప్పందాలని క్షుణ్ణంగా పరిశీలించి ఏపీ ఆభివ్రుద్దికి ఏ మాత్రం తోడ్పడుతాయో నిపుణులతో బేరీజు వేస్తున్నారు.
వందలాది సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్న చంద్రబాబు ఆ కంపెనీల వలన వేలాది ఉద్యోగాలు వచ్చి పడతాయని ఊదరగొట్టారు. దాంతో కొన్ని వందల ఎకరాలని ఇష్టానుసారంగా దారాదత్తం చేశారు. కానీ ఇప్పటికీ ఒక్క కంపెనీ కూడా అక్కడ తమ సంస్థలకి శంకుస్థాపన చేసిన ధాకలాలు లేవని అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్ సంస్థ తిరుపతి రేణిగుంట సమీపంలో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ ,అలాగే కాకినాడలో సహజవాయువు వేలికి తీయడానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది.
జగన్ అధికారాన్ని చేపట్టిన తరువాత రిలయన్స్ రెండు ఒప్పందాలలో ఒకటి వెనక్కి తీసుకుందని ప్రచారం చేసింది టీడీపీ. దీనిపై స్పందించిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇదంతా టీడీపీ దుష్ప్రచారమని అన్నారు. టీడీపీ రిలయన్స్ కి కేటాయించిన భూములు కోర్టు కేసులో ఉన్నాయి కాబట్టి ఏపీఐఐసి ద్వారా వేరే ప్రాంతంలో భూములు కేటాయించాలని భావిస్తున్నామని వివరణ ఇచ్చారు. అయితే చిత్తూరు జిల్లా రేణిగుంట లో రిలయన్స్ కి ఇచ్చిన భూములని ప్రభుత్వం పేదలకి ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ ప్రాంత తహసీల్దార్ కలక్టర్ కి నివేదికలు పంపారని తెలుస్తోంది. కలక్టర్ గనుకా దీనిని ఆమోదిస్తే సుమారు 60 ఎకరాల భూమిని పేదలకి పంచడమే కాకుండా రిలయన్స్ తో కుదుర్చుకున్న ఎంవోయూ రద్దు అవుతుంది. అయితే రిలయన్స్ కి భూమి వేరొక చోట కేటాయించుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.