పశ్చిమగోదావరి జిల్లా
టిడిపిని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, జనసేన ను రౌడీ సేనగా మార్చేసారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘గతంలో వాళ్ల పాలనను చూసి ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకున్నారు. అందుకే 2019లో చిత్తుగా ఓడించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లోను బాబుకు బై బై చెప్పారు. కుప్పంలోనూ టిడిపిని చిత్తుగా ఓడించారు. ఈసారి కుప్పంలోనూ గెలవన అనే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంది’ అని జగన్ విమర్శించారు.