ఎప్పటినుంచో కంటున్న కల ని తీర్చుకున్న జగన్ .. ఎంత కష్టపడ్డాడు అంటే చిన్న విషయం కాదు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యక్తిగతంగా చాలా మొండి వాడు అని అందరికీ తెలిసినదే. ఎంత ముఖ్యమంత్రి కొడుకు గా బతికిన గాని తనలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి లా బతకాలన్న కోరిక ను జయించడం కోసం రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించే విధంగా ఫలితాలు రాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సంవత్సరం గడవకముందే నెరవేర్చడానికి అన్ని విధాలా జగన్ రెడీ అవుతున్నారు.

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరోపక్క అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు జగన్. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో ఒక దురుద్దేశంతో అమరావతిని రాజధానిగా ప్రకటించి తన వర్గ ప్రజల కోసం చేసిన ప్రయత్నాన్ని విఫలమయ్యే లా జగన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇందుమూలంగా తన కలల రాజధాని అమరావతి అడ్డుకున్న జగన్ కి చెక్ పెట్టే విధంగా చంద్రబాబు మూడు రాజధానుల వ్యవహారంలో విశాఖపట్టణంలో రాజధాని పెట్టకూడదని నేవి ఒప్పుకోలేదని అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఇటీవల చంద్రబాబు ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే ఈ సందర్భంలో విశాఖలో ఎప్పటినుండో రాజధాని పెట్టాలని 2014 ఎన్నికల సమయంలోనే జగన్ కల అని వైసిపి లో ఉన్న కొంతమంది జగన్ నమ్మకమైన వాళ్ళు చెప్పటం జరిగింది. అందువల్లనే 2014 ఎన్నికల సమయంలో విశాఖలో తన తల్లి విజయమ్మ నీ పోటీ పెట్టినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో విజయమ్మ ఓడిపోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్ వైజాగ్ ని రాజధానికి గుర్తించడంతో అడ్డుకోవాలని టిడిపి నేవి పేరిట లెటర్ తమకి వచ్చినట్టు చంద్రబాబు చేసిన ఆరోపణలపై జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

 

దీని గురించి విశాఖపట్టణం నేవీ కి చెందిన వాళ్లని జగన్ సర్కార్ ప్రశ్నించడం జరిగిందట. జగన్ సర్కార్ ప్రశ్నకి విశాఖ నేవీ ప్రతిస్పందిస్తూ….రాజధానిగా విశాఖపట్టణం ని గుర్తించడం మాకు ఇష్టమే మేము ఎటువంటి లెటర్ చంద్రబాబు ప్రభుత్వానికి రాయలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఎప్పటినుంచో విశాఖపట్టణం ని రాజధానిగా చేయాలని జగన్ కంటున్న కల కి పూర్తిగా లైన్ క్లియర్ అయిందని ఎలాగైతే తాను అనుకున్నది చాలా కష్టపడి జగన్ సాధించడం జరిగిందని మరికొద్ది రోజుల్లో విశాఖపట్టణం నీ రాజధానిగా ప్రకటించడం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version