ఏపీ సీఎం వైఎస్ జగన్ తెరపైకి తీసుకు వచ్చిన మూడు రాజధానుల విషయంలో అనేక ఇబ్బందులు ప్రస్తుతం ఎదురవుతున్నాయి. దీంతో ఆదిలోనే ఈ మూడు రాజధానుల విషయంలో పెద్దగా రాజకీయ అంశం కాకూడదని ప్రభుత్వంపై చెడ్డపేరు రాకూడదని జగన్ సూపర్ టార్గెట్ ఫిక్స్ చేసినట్లు వైకాపా పార్టీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఎక్కువగా మూడు రాజధానులను ఫస్ట్ నుండి అడ్డుపడుతున్న అమరావతి రైతులతో చర్చలు జరిపి వారిని ఒప్పించే కార్యక్రమం చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇందు మూలంగానే ఇటీవల మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్ రావు ఆ తరువాత ఎంపీ లావు కృష్ణదేవరాయులు అమరావతి రైతుల విషయంలో ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై ఆలోచన చేసినట్లు సమాచారం.
దీంతో జగన్ తో ఇద్దరు భేటీ ముగిసిన తర్వాత వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు నేరుగా అమరావతిలో ధర్నాలు నిరసనలు చేస్తున్న రైతుల దగ్గర వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి ఒక కమిటీ వస్తుందని మీ డిమాండ్లు అన్ని ఆ కమిటీకి వివరించాలని ఎంపీ రాజధాని రైతులను కోరారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉండదని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ హామీ ఇచ్చారు.
దీంతో చాలామంది రైతులు ప్రభుత్వం అందించే హామీల విషయంలో అమరావతి ప్రాంతంలో దీక్షలు నిరసనలు చేస్తున్న వారిలో చాలావరకు పాజిటివ్ వాతావరణం ఏపీ ప్రభుత్వంపై ఏర్పడినట్లు దీంతో త్వరలోనే అమరావతి రైతులంతా కలిసి సీఎం జగన్ ని కలవడానికి కూడా సిద్ధపడుతున్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద అమరావతి రైతుల విషయంలో వైకాపా ప్రభుత్వం భారీగానే ప్యాకేజ్ రైతులకు అమలు చేయటానికి ఇష్టపడుతున్నట్లు ప్రస్తుత పరిణామాల బట్టి అర్థమవుతుంది.